: పెట్టుబడులకు ఏపీలో మంచి అవకాశాలున్నాయి: చైనాలో జెట్రో ప్రెసిడెంట్‌తో సీఎం చంద్ర‌బాబు


ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధే ధ్యేయంగా పెట్టుబడులను ఆకర్షించడానికి చైనాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు జెట్రో ప్రెసిడెంట్ య‌సూషి అక‌హోషితో సమావేశం అయ్యారు. పెట్టుబడులకు ఏపీలో ఉన్న అవకాశాలను ఆయన య‌సూషి అక‌హోషికి వివరించారు. రాష్ట్రంలో మంచి వాణిజ్య అవ‌కాశాలు ఉన్నాయని ఆయ‌న అన్నారు. పరిశ్రమల స్థాపనకు ఏపీ అనుకూల ప్రాంతమని, తమ ప్రభుత్వం అన్ని అనుమ‌తులు వేగంగా ఇస్తుందని చంద్రబాబు చెప్పారు. జెట్రోతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు స‌త్సంబంధాలున్నాయ‌ని పేర్కొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందుతోందని ఆయ‌న పేర్కొన్నారు. రాష్ట్రం 10.99శాతం వృద్ధి రేటు సాధించింద‌ని, 15 శాతం వృద్ధి రేటు సాధించ‌టమే త‌మ‌ ల‌క్ష్యమ‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News