: తెలంగాణ వైఎస్సార్సీపీ నుంచి మరో జంప్
జంపింగ్ లతో సతమతమవుతున్న వైఎస్సార్సీపీకి తాజాగా మరో దెబ్బ తగిలింది. నల్లగొండ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఐలా వెంకన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెం 123తో ఎక్కువ పరిహారం వస్తుందని చెప్పి రైతులను మోసం చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. పులిచింతల ప్రాజెక్టు పునరావాసుల విషయమై టీఆర్ఎస్ అనవసర ఆరోపణలను తమపై చేస్తోందన్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులకు ఎక్కువ న్యాయం జరిగేలా చూసింది తామేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.