: ‘హార్వర్డ్’ బాట పట్టనున్న టెన్నిస్ స్టార్ షరపోవా
డోపింగ్ టెస్టుల్లో దొరికిపోయి, రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొంటున్న టెన్నిస్ స్టార్ మారియా షరపోవా చదువుపై దృష్టి సారించింది. బోస్టన్ లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో చేరనుంది. బిజినెస్ డిగ్రీ చదివేందుకు గాను హార్వర్డ్ లో చేరనున్నట్లు షరపోవా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపింది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ముందు దిగిన ఒక ఫొటోను కూడా పోస్ట్ చేసింది. కాగా, మెల్డోనియమ్ డ్రగ్ ను తీసుకోవడంతో షరపోవాపై ప్రపంచ టెన్నిస్ ఫెడరేషన్ ఆమెపై నిషేధం విధించింది. వైద్యుల సలహా మేరకు తాను పదేళ్లుగా ఈ డ్రగ్ ను తీసుకుంటున్నట్లు షరపోవా చెప్పిన విషయం తెలిసిందే.