: భారత్ పై బ్రెగ్జిట్ తొలి దెబ్బ ప్రభావం... రూ. 3 లక్షల కోట్లు హారతి
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలని వెల్లడైన ప్రజా తీర్పు, భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారి సంపదను హరించి వేసింది. స్టాక్ మార్కెట్ సూచిక బీఎస్ఈ ఏకంగా 1000 పాయింట్లకు పైగా పడిపోగా, లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 3.6 లక్షల కోట్లు హారతి కర్పూరమైంది. గురువారం నాడు మార్కెట్ సెషన్ ముగిసే సమయానికి రూ. 1,01,38,218 కోట్లుగా వున్న బీఎస్ఈ మార్కెట్ కాప్, ఈ మధ్యాహ్నం 12:35 గంటల సమయంలో రూ. 97,74,226 కోట్లకు దిగివచ్చింది. ఇదే సమయంలో సెన్సెక్స్ 1011 పాయింట్లు నష్టపోయి 25,990 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మొత్తం 2,348 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 230 కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి.