: టీమిండియా ప్రధాన కోచ్ గా అనిల్ కుంబ్లే: బీసీసీఐ అధ్యక్షుడు


టీమిండియా ప్రధాన కోచ్ గా అనిల్ కుంబ్లేను నియమించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చర్చల తర్వాత అనిల్ కుంబ్లేను కోచ్ గా నిర్ణయించామని, ఏడాదిపాటు ఆయన కోచ్ బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు. కాగా, ఈ పదవికి మొత్తం 57 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, కుంబ్లే, సందీప్ పాటిల్, వెంకటేశ్ ప్రసాద్ లే కాకుండా విదేశీ క్రికెట్ దిగ్గజాల నుంచి కూడా దరఖాస్తులు అందిన విషయం తెలిసిందే. ఆ దరఖాస్తులను వడబోసి 20 మందితో ఒక జాబితాను రూపొందించిన బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ .. ఫైనల్ గా కుంబ్లేను ఎంపిక చేసింది.

  • Loading...

More Telugu News