: 3 పరుగుల తేడాతో జింబాబ్వేపై భారత్ విజయం... సిరీస్ కైవసం!
హరారే వేదికగా జింబాబ్వేతో ఈరోజు జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. దీంతో జింబాబ్వేతో మూడు టీ-20 సిరీస్ ను 2-1తో టీమిండియా సొంతం చేసుకుంది. ఉత్కంఠకరంగా జరిగిన చివరి మ్యాచ్ లో భారత్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అనంతరం 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే పూర్తి ఓవర్లలో ఆరు వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేసింది. చివరి ఓవర్ లో జింబాబ్వే విజయానికి 21 పరుగులు అవసరం కాగా, తొలి రెండు బంతుల్ని మరుమా(23), సిక్స్, ఫోర్ కొట్టాడు. దీంతో టీమిండియా కంగారుపడింది. అయితే, బౌలర్ శరణ్ కట్టడి చేయడంతో భారత్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.