: ‘ఇంటర్నెట్ ఫర్ ఆల్’... ప్రీపెయిడ్ కస్టమర్లకు ‘ఐడియా’ బంపర్ ఆఫర్


‘ఇంటర్నెట్ ఫర్ ఆల్’ అనే ఆవిష్కరణతో ప్రీపెయిడ్ కస్టమర్లకు, రిటైలర్లకు ఐడియా సెల్యులార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇంటర్నెట్ వినియోగించని వారిని లక్ష్యంగా చేసుకుని ఈ బంపర్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది. ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు, రిటైలర్లకు నెలకు 100 ఎంబీ డేటా ఉచితంగా అందించనున్నట్టు ఐడియా సెల్యులార్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటర్నెట్ వరల్డ్ కు తమ కస్టమర్లందరినీ చేర్చాలనే ఉద్దేశంతోనే ఈ సేవలను ప్రారంభించామన్నారు. నాన్ ఇంటర్నెట్ యూజర్లు ఈ ఉచిత డేటా సర్వీసులను ఏ విధంగా వినియోగించుకోవాలనే సమాచారం తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటామని చెప్పారు. *756# కు డయల్ చేయడం ద్వారా లేదా ఐఎఫ్ఏ అని 56756కు మెసేజ్ పంపడం ద్వారా ఈ సర్వీసు కస్టమర్లందరికీ అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News