: నెల రోజుల తరువాత ట్విట్టర్లో ప్రత్యక్షమైన మహేష్ బాబు!


తన చిత్రాలను గురించి, తన రోజువారీ షూటింగ్ విశేషాలను గురించి ఎప్పటికప్పుడు అభిమానులకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఉండే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, బ్రహ్మోత్సవం చిత్రం విడుదల తరువాత ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన్నుంచి నెల రోజుల తరువాత తొలి ట్వీట్ ప్రత్యక్షమైంది. శ్రీమంతుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్న ఆయన, టైమ్స్ గ్రూప్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఓ మంచి కార్యక్రమాన్ని తాను మిస్ అయ్యానని చెప్పిన మహేష్, ఈ అవార్డు తన అభిమానులందరిదని, తనను ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News