: పాకిస్థాన్ లో 'ఓం' గుర్తుతో షూల అమ్మకాలు... అడ్డు చెప్పలేక పోతున్న మైనారిటీ హిందువులు!
పాక్ లో కాలం వెళ్లదీస్తూ, నిత్యం తమ హక్కుల కోసం పోరాటం చేస్తూ, మైనారిటీలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న హిందువులు ఇప్పుడు తమ మనోభావాలకు అమర్యాద జరగకుండా చూడాలని కోరుతున్నారు. హిందువుల దేవతా చిహ్నంగా ఉన్న 'ఓం'ను షూలపై ముద్రించిన ఓ సంస్థ వాటిని సింథ్ ప్రావిన్స్ ప్రాంతంలో అమ్ముతుండగా అక్కడి వారు అడ్డు చెప్పలేకపోతున్నారు. ప్రస్తుత రంజాన్ సీజనులో షాపింగ్ జోరుగా సాగుతుండగా, హిందువుల సెంటిమెంట్ ను దెబ్బతీసేలా జరుగుతున్న షూల వ్యాపారంపై నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ ప్రతినిధి రమేష్ కుమార్ రంగంలోకి దిగి, సింథ్ ప్రభుత్వంపై నిరసన తెలిపారు. ఓం గుర్తుతో ఉన్న షూల చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, వీటిని తక్షణం దుకాణాల నుంచి తొలగించాలని పాక్ హిందువులు డిమాండ్ చేస్తున్నారు.