: నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ లకు భయంకరమైన అభిమానిని: నాగశౌర్య


నాగార్జునకు, జూనియర్ ఎన్టీఆర్ లకు తాను భయంకరమైన ఫ్యాన్ నని హీరో నాగశౌర్య అన్నాడు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు మరింత ఫ్యాన్ నయ్యానని చెప్పాడు. యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని ఉందని.. అందుకోసం విలన్, కమెడియన్ మొదలైన పాత్రల్లో నటించాలని, ప్రతినాయకుడి పాత్రలో నటించాలనే కోరిక తనకు బాగా ఉందని చెప్పాడు. ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియాలని, అదే విధంగా ఎక్కడ తగ్గించాలో కూడా తెలియాలని, నిర్మాతలను కాపాడాల్సిన బాధ్యత నటులదేనని నాగశౌర్య అన్నాడు. తన తాజా చిత్రం ‘ఒక మనసు’లో కాస్ట్యూమ్స్ కు చాలా తక్కువ ఖర్చు అయిందని చెప్పాడు. తనకు ప్రమోషన్ పిచ్చి లేదని, ఆ విషయంలో ఒకరికి ఇంపార్టెన్స్ ఇచ్చారని, తనకు ఇవ్వలేదనే విషయాలను తాను పట్టించుకోనని ఒక ప్రశ్నకు సమాధానంగా నాగశౌర్య చెప్పాడు.

  • Loading...

More Telugu News