: రెహమాన్ తో రెండో సారి పనిచేసే అవకాశం ఇచ్చారు: నాగచైతన్య
సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా రెహమాన్ గారితో మ్యూజిక్ చేయించుకోవాలని అనుకుంటారు. అలాంటి అవకాశం తనకు రెండుసార్లు వచ్చిందని, గౌతమ్ మీనన్ ఆ అవకాశాన్ని కల్పించారని నాగచైతన్య అన్నాడు. 'సాహసం శ్వాసగా సాగిపో' ఆడియో వేడుకలో నాగచైతన్య మాట్లాడుతూ, దర్శకుడు గౌతమ్ మీనన్ తనకు సినీ పరిశ్రమలో ఓ స్థానాన్ని ఇవ్వడమే కాకుండా, ఆర్టిస్టుగా చాలా నేర్పించారని అన్నాడు. 'ఏం మాయ చేసావే' తరువాత రెహమాన్ గారికి ధన్యవాదాలు తెలిపే అవకాశం రాలేదని, ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నానని నాగచైతన్య తెలిపాడు.