: పాకిస్థాన్, అమెరికా మధ్య ఎఫ్-16 యుద్ధ విమానాల డీల్ రద్దు!


అమెరికా నుంచి అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాలను పొందాలన్న పాకిస్థాన్ ఆశ అడియాశే అయింది. ఈ డీల్ రద్దు అయిందని, ఎఫ్-16 స్థానంలో జోర్డాన్ తయారు చేస్తున్న జెట్ విమానాలను కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉన్నామని పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి అజాజ్ చౌదరి వ్యాఖ్యానించారు. సెనేట్ స్టాండింగ్ కమిటీ ముందు ప్రసంగించిన ఆయన, తమ భూభాగంలో అమెరికా డ్రోన్లతో దాడి చేయడాన్ని ప్రస్తావిస్తూ, తామే డీల్ ను వద్దనుకున్నామని తెలిపారు. ఉగ్రవాదంపై అమెరికా వైఖరిని సైతం ఆయన ఖండించారు. ఉగ్రవాదంపై పదహారు సంవత్సరాలుగా పోరాడుతున్న అమెరికా, ఆరేళ్లు శాంతి కోసం ప్రయత్నిస్తే పరిస్థితి వేరుగా ఉండేదని అన్నారు. పాక్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా అమెరికా తమ భూభాగంపై దాడులు చేసిందని ఆయన ఆరోపించారు. చైనాతో తమకున్న దగ్గరి సంబంధాలు కూడా అమెరికాకు కంటగింపుగా మారాయని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News