: కువైట్ ఎయిర్ పోర్టులో భారీ అగ్ని ప్రమాదం
కువైట్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. టర్నినల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని పెద్దఎత్తున మంటలు ఎగసిపడగా, సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశాయి. మొత్తం ఐదు అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పాయని కేఎఫ్ఎస్‌డీ (కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్) పేర్కొంది. కొద్దిగా ఆస్తినష్టం మినహా ఎవరి ప్రాణాలకు ప్రమాదం కలగలేదని, దీనికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని వివరించారు.