: సెమీ ఫైనల్‌లో భారతాభిమానులకు నిరాశ మిగిల్చిన కిదాంబి శ్రీకాంత్
నిన్న జరిగిన ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్వార్టర్స్‌లో అంచనాలకు మించి రాణించి సింగిల్స్ విభాగంలో సెమీ ఫైనల్లోకి ప్రవేశించిన ఇండియన్ స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఈరోజు జరిగిన సెమీ ఫైనల్లో భారత అభిమానులకు నిరాశే మిగిల్చాడు. ఈరోజు ఉదయం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో డెన్మార్క్ షట్లర్ హన్స్ క్రిస్టియన్ తో శ్రీకాంత్ పోరాడి ఓడాడు. 22-20, 21-13 వరుస సెట్లతో పరాజయం పాలయ్యాడు. ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఇక భారత అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు మరో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పైనే ఉన్నాయి. నిన్నటి క్వార్టర్ ఫైనల్లో సైనా సింగిల్స్ విభాగంలో థాయిలాండ్ క్రీడాకారిణి రచనోక్ పై గెలుపొంది సెమీఫైనల్‌కి చేరిన విషయం తెలిసిందే.