: కాలిఫోర్నియాలో భూ ప్రకంపనలు
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఈరోజు భూమి కంపించింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని, అమెరికా జియోలాజికల్ సర్వీసెస్ వెల్లడించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.2 గా నమోదైందని, 30 సెకన్ల పాటు భూమి కంపించిందని, తూర్పు లాస్ ఏంజిల్స్ ఎడారిలోని వాయవ్య బొరెగో స్ప్రింగ్స్ కు కొన్ని మైళ్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. లాస్ ఏంజిల్స్ పశ్చిమ ప్రాంతం, శాన్ డియాగోలో ప్రకంపనల తీవ్రత కనిపించిందని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.