: బరువు తగ్గారా ఓకే... లేదా ఉద్యోగం వదులుకోవాల్సిందే: ఎయిర్ ఇండియా అల్టిమేటం

ఎయిరిండియా తన ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది. ఎయిరిండియాలో 2,800 మంది సిబ్బంది ఉండగా, వారిలో 150 మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వారందరినీ బరువు తగ్గాలని, లేనిపక్షంలో విధుల నుంచి తప్పిస్తామని ఎయిర్ ఇండియా అల్టిమేటం జారీ చేసింది. దీంతో వీరంతా బరువు తగ్గించుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. ఎయిరిండియాలో క్యాబిన్ క్రూలో విధులు నిర్వర్తించే మహిళల బాడీ మాస్ ఇండెక్స్ 27, పురుషుల్లో 30 కంటే ఎక్కువ ఉన్నవారు నాజూగ్గా మారకపోతే విధుల్లోకి అనుమతించమని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.

More Telugu News