: విశాఖలో కూలీలపై దాడి చేసిన పెంపుడు కుక్క.. ఇద్దరు కూలీలు మృతి

కూలీలపై పెంపుడు కుక్క దాడి చేయడంతో ఇద్దరు మృతి చెందిన విషాద సంఘటన విశాఖపట్టణంలో చోటు చేసుకుంది. అక్కయ్యపాలెంలోని లలితానగర్ లో నిర్మాణంలో ఉన్న భవనం మూడో అంతస్తులో నిర్మాణ పనుల నిమిత్తం పది మంది కూలీలు అక్కడికి వెళ్లారు. అదే అంతస్తులో ఉన్న పెంపుడు శునకం గొలుసులు తెంచుకుని కూలీలపై దాడి చేయడంతో వారు పరుగులు తీశారు. ఈ క్రమంలో భయంతో ముగ్గురు కూలీలు అక్కడి నుంచి కిందకు దూకేశారు. ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.

More Telugu News