: ఆస్ట్రేలియాలో లీటర్ పెట్రోలు 53 రూపాయలే...17 ఏళ్ల కనిష్ఠానికి దిగజారిన ధర


మనదేశంలో రోజురోజుకీ పెట్రోలు ధరలు చుక్కలనంటుతుండగా, ఆస్ట్రేలియాలో 17 ఏళ్ల కనిష్ఠానికి దిగజారాయి. ఆస్ట్రేలియా మొత్తం పెట్రోలు ధరలు 1999 నాటి కనిష్ఠానికి చేరుకున్నాయని ఆస్ట్రేలియా కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ (ఏసీసీసీ) తెలిపింది. మార్చితో ముగిసిన క్వార్టర్ లో పెట్రోల్ ధర 10 శాతం తగ్గడంతో కేవలం 53 రూపాయలు (81.4 అమెరికన్ సెంట్లు) పలుకుతోందని ఆ సంస్థ పేర్కొంది. ముడి చమురు ధరల పతనం, మార్కెట్ ను పరిశీలించడం వంటి ఎన్నో కారణాలు పెట్రోలు ధరలు తగ్గడంలో పాత్ర పోషించాయని ఏసీసీసీ తెలిపింది. సిడ్నీలో లీటర్ పెట్రోలు ధర అత్యల్పంగా 53 రూపాయలు ఉండగా, కాన్ బెర్రా, హోబర్ట్ లలో అత్యధికంగా 59 రూపాయలు పలుకుతోందని ఏసీసీసీ తెలిపింది.

  • Loading...

More Telugu News