: 'రోటీ' డ్రెస్ పై స్పందించిన సోనమ్ కపూర్
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ధరించిన డ్రెస్ (రోటీ)పై వచ్చిన విమర్శలపై స్పందించింది. సాధారణంగా పొడుగాటి దుస్తులను ధరించడం తనకు పెద్దగా ఇష్టం ఉండదని చెప్పింది. అయితే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై మరింత అందంగా కనిపించాలని అలా పొడుగు దుస్తులు ధరించానని చెప్పింది. అలా ధరించడం తనకు ఇబ్బందనిపించిందని తెలిపింది. సాధారణంగా స్టైల్ గా, మోడ్రన్ గా కనిపించడం తనకు ఇష్టమని చెప్పింది. స్టైల్ గా కనిపించే క్రమంలో పలు విమర్శలు వస్తాయని, వాటిని తాను పట్టించుకోనని ఆమె అంది. ఏమైనా, ఎలాంటి దుస్తులు వేసుకోవాలన్న దానిపై తనకు అవగాహన ఉందని తెలిపింది. సౌకర్యంగా ఉన్న దుస్తులనే తాను ధరిస్తానని సోనమ్ చెప్పింది.