: మూడు అడుగుల పొడవుండే వానపాములు నిర్మించిన గుట్టలు ఇవి..!
దక్షిణ అమెరికాలో వానపాములు గుట్టలు నిర్మించాయట. మిస్టరీగా కనిపిస్తోన్న ఈ గుట్టలపై జర్మనీలోని బ్రౌన్‌స్వేగ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, కెనడాలోని మెక్‌గిల్ వర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనల్లో ఈ విషయం బయట పడింది. మామూలుగా గుట్టలు, కొండలు అంటే మన ఊహకు అందేవి అక్కడ ఉండే రాళ్లు.. కానీ అక్కడి గుట్టల్లో అలాకాదు. ఇక్కడ మనం ఎంతగా వెతికినా మన కంటికి రాళ్లు కనిపించవు. అక్కడ వానపాముల వ్యర్థాలతో నిర్మితమైన సారవంతమైన గుట్టలు మాత్రమే కనిపిస్తాయి. దక్షిణ అమెరికాలో ఉన్న ఈ చిన్న చిన్న గుట్టలు మూడు అడుగుల పొడవు ఉండే వానపాముల వ్యర్థాలతో ఏర్పడ్డాయట. ఎటుచూసిన వానపాముల విసర్జితాలతో నిర్మితమై ఉండే గుట్టలే అక్కడ కనిపిస్తాయట. గుట్టలు అన్న మాటే కానీ అక్కడ ఒక్క రాయీ కనిపించదని పరిశోధకులు చెబుతున్నారు.