: సౌదీలో కనిపించిన నెలవంక!... గల్ఫ్ దేశాల్లో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం
ముస్లిం సోదరుల పవిత్ర మాసం రంజాన్... గల్ఫ్ దేశాల్లో ప్రారంభమైపోయింది. ఆ దేశాల్లో నిన్న రాత్రి నుంచే మొదలైన రంజాన్ మాసం నేపథ్యంలో ఉపవాస దీక్షలు కూడా మొదలైపోయాయి. రంజాన్ మాసం ప్రారంభానికి సూచకంగా నెలవంక దర్శనం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న ముస్లిం సోదరులకు నిన్న సౌదీ అరేబియాలో ఆ నెలవంక కనిపించింది. దీంతో రంజాన్ మాసం ప్రారంభమైందని ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. నెల రోజుల పాటు పవిత్ర ఉపవాస దీక్షలను ఆచరించనున్న ముస్లింలు మరోమారు నెలవంక దర్శనంతో రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకోనున్నారు.