Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఆర్ఎస్-సీపీఐ కార్యకర్తల ఘర్షణ... టీఆర్ఎస్ కార్యకర్త మృతి

ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడులో టీఆర్ఎస్, సీపీఐ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో టీఆర్ఎస్ కార్యకర్త సత్తి సంగయ్య(55) మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు గూడూరుపాడులో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంపైకి సీపీఐ కార్యకర్తలు రాళ్లు రువ్విన ఘటనలో సత్తి సంగయ్యకు బలంగా ఒక రాయి తగిలింది. దీంతో అక్కడికక్కడే ఆయన కుప్పకూలిపోయాడు. ఈ సంఘటనలో మరో ముగ్గురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ సంఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గూడూరుపాడు ఘటన దురదృష్టకరమని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని, శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

More Telugu News