అందం మీద మక్కువతో 19 సర్జరీలు చేయించుకున్న మోడల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందం మీద మక్కువతో 19 సర్జరీలు చేయించుకున్న మోడల్!

ఒక్కొక్కరి అభిరుచి ఒక్కోలా ఉంటుంది. స్వీడన్ కు చెందిన పిక్సీ ఫాక్స్ (26) అనే మోడల్ కు అందంగా కనిపించడం అంటే చాలా ఇష్టం. ఇందుకోసం ఆమె ఇప్పటి వరకు 19 సర్జరీలు చేయించుకుని సంచలనం రేపింది. ఒకప్పుడు ఎలక్ట్రీషియన్ గా పనిచేసిన ఆమె మోడల్ గా మారి, పలు సంచలనాలకు కేంద్రమైంది. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వక్షోజాలు, ముక్కు, ముఖం ఇలా పలు శరీర భాగాల్లో శస్త్ర చికిత్సలు చేయించుకుంది. అంతేకాదు, నాజూకైన నడుము కోసం ఆరు పక్కటెముకలు తీయించుకుని 14 ఇంచుల నడుముతో మోడల్ ప్రపంచంలో ప్రత్యేకత చాటుకుంటోంది. తాజాగా ఆకుపచ్చ కళ్ల సుందరి అనిపించుకోవాలనే ఆశ పుట్టడంతో, గ్రీన్ కలర్ లోకి మార్పించుకునేందుకు సర్జరీ చేయించుకుంది. ఇలా ఎందుకు? అని అడిగితే కార్టూన్ క్యారెక్టర్ లోలా కనిపించేందుకు అని సమాధానమిచ్చింది. అందం కోసం ఆమె చేస్తున్న ఖర్చు, సమయం తలచుకుని అంతా ఆశ్చర్యపోతున్నారు. అందం పట్ల మరీ ఇంత పిచ్చి ఉండకూడదని పలువురు కామెంట్ చేస్తున్నారు.

More Telugu News