: ఈ సినిమా పెద్ద హిట్టయితే వెంటనే నితిన్ కు పెళ్లే: సమంత
ఈ సినిమా హిట్టయితే వెంటనే నితిన్ కు పెళ్లేనని సమంత జోక్ చేసింది. 'అఆ' సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నితిన్ తన కెరీర్ పై ఫోకస్ చేసి, వ్యక్తిగత జీవితాన్ని మర్చిపోయాడని చెప్పింది. అందుకే తొందరగా పెళ్లి చేసేయాలని పేర్కొంది. సినిమా హిట్ కాగానే నితిన్ కు పెళ్లేనని తెలిపింది. 'అఆ' మంచి ఫీల్ గుడ్ సినిమా అని చెప్పింది. త్రివిక్రమ్ ను బెస్ట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ అని పేర్కొంది. సమంత చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అని నితిన్ చెప్పాడు. త్రివిక్రమ్ తనకు వ్యక్తిగతంగాను, వృత్తి పరంగాను చాలా నేర్పాడని నితిన్ చెప్పాడు. తన దగ్గరకు వచ్చే కొత్త సినిమాల విషయంలో ముందుగా స్క్రిప్టును, దర్శకుడ్ని చూస్తానని, ఆ రెండూ నచ్చితే సినిమా చేసేందుకు తనకు అభ్యంతరం లేదని అన్నాడు. సినిమా హిట్టయినా, ఫట్టయినా తనకు ఒకటేనని నితిన్ చెప్పాడు. ఈ క్రెడిట్ తీసుకునేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని నితిన్ చెప్పాడు.