: పతంజలి నెయ్యి, తేనే ఓకే.. సబ్బుల అమ్మకాల్లో మాత్రం మేమే టాప్ -ఆది గోద్రేజ్
ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబాకు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలిపై గోద్రేజ్ గ్రూప్ ఛైర్మన్ ఆది గోద్రేజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాందేవ్ బాబాకున్న ఇమేజ్ కారణంగానే ఎఫ్.ఎం.సీ.జీ మార్కెట్లో నెయ్యి, తేనే లాంటి వారి చిన్నపాటి ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయని, విలువ ఆధారిత విభాగమైన సబ్బుల అమ్మకాల్లో తమతో పోటీలేదని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆది గోద్రేజ్ అన్నారు. తమ కంపెనీ పదేళ్లలో 10 రెట్ల వృద్ధితో దూసుకుపోతోందని అన్నారు. పతంజలి సంస్థ నుంచి తమకు పోటీ చాలా చిన్నదని ఆది గోద్రేజ్ తేలిగ్గా తీసిపారేశారు. మ్యాగీ నిషేధం తరువాత పతంజలి ఉత్పత్తులకు డిమాండ్ పెరుగగా, ఇటీవలే గ్రూప్ ఆదాయం రూ.5వేల కోట్ల మార్కును దాటింది. 2020 నాటికి రూ.20వేల కోట్లను దాటుతుందని బ్రోకరేజ్ సంస్థ ఐ.ఐ.ఎఫ్.ఎల్ అంచనా వేసింది. సరిగ్గా ఇటువంటి సమయంలో గోద్రేజ్ విమర్శించడం చర్చనీయంగా మారింది.