: ఆ ఉద్దేశంతో సినిమాలు చేయను: ఐశ్వర్యారాయ్ బచ్చన్


బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించాలని, కలెక్షన్లు కురిపించాలనే ఉద్దేశంతో తాను సినిమాల్లో నటించనని బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యారాయ్ బచ్చన్ అన్నారు. ఇటీవల విడుదలైన చిత్రం ‘సరబ్ జిత్’ లో తన నటనకుగాను ఐశ్వర్య ప్రశంసలందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘సరబ్ జిత్’ చిత్రానికి మొదటి నుంచి మంచి ప్రశంసలు లభించాయని, ప్రేక్షకుల ఆదరణతో ఈ చిత్రం ఆడుతుందని అన్నారు. దర్శకుడు ఒమాంగ్ కుమార్ రూపొందించిన ఈ చిత్రంలో ఐశ్వర్య, రిచా చద్దా, రణ్ దీప్ హుడా లు ప్రధాన పాత్రల్లో నటించారు.

  • Loading...

More Telugu News