: తెలంగాణ ప్రజలకు టీడీపీ శ్రేణులు అండగా ఉండాలి: సీఎం చంద్రబాబు


తెలంగాణలో కరవు తీవ్రంగా ఉందని, అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారికి టీడీపీ శ్రేణులు అండగా నిలవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తెలంగాణ ప్రజలకు అండగా నిలబడి వారి నమ్మకం పొందాలని సూచించారు. ముఖ్యంగా తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వారి కోసం పోరాడాలని, వారి సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ సర్కార్ పై ఒత్తిడి తేవాలని చంద్రబాబు అన్నారు. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నా ఏపీ లో అధికారంలోకి రాగలిగామని, తెలంగాణలో ఆ అవకాశం రాకపోవడం వల్ల మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజలు, రైతుల ఇబ్బందులు తనకు తెలుసునని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, అయితే, అక్కడి ప్రజలు ఆశించినంత సమయాన్ని వారికి కేటాయించలేకపోతున్నానని, తన పరిస్థితిని కూడా వారు అర్థం చేసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News