: కన్వీనర్ కోటా మాత్రమే ఎంసెట్ ద్వారా భర్తీ చేస్తారట... అసలు విషయాన్ని వెల్లడించిన కామినేని!
దేశవ్యాప్తంగా మెడికల్ సీట్ల భర్తీ కోసం ప్రవేశపెట్టిన ‘నీట్’ను ఈ ఏడాదికి వాయిదా వేసినట్లు కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. అయితే ఆ ఆర్డినెన్స్ లోని అసలు మతలబును కొద్దిసేపటి క్రితం ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విప్పి చెప్పారు. కొద్దిసేపటి క్రితం ప్రైవేట్ మెడికల్ కళాశాలల యాజమాన్యాలతో ఆయన విజయవాడలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెడికల్ సీట్ల భర్తీ, నీట్ ఆర్డినెన్స్ తదితరాలపై చర్చ జరిగింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కామినేని... ఆర్డినెన్స్ ప్రకారం కన్వీనర్ కోటా సీట్లకు మాత్రమే నీట్ నుంచి మినహాయింపు ఉందని చెప్పారు. ఈ కోటా సీట్లు మాత్రమే ఎంసెట్ ద్వారా భర్తీ చేయడానికి వీలవుతుందని ఆయన చెప్పారు. ఇక మేనేజ్ మెంట్, ఎన్నారై కోటా సీట్లన్నీ నీట్ పరీక్ష ఆధారంగానే భర్తీ అవుతాయని ఆయన చెప్పేశారు.