: రోడ్డెక్కిన వంగవీటి రాధా!... చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైసీపీ నేత
బెజవాడ రాజకీయాల్లో కీలక నేత, వైసీపీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధా కొద్దిసేపటి క్రితం నగరంలో ధర్నాకు దిగారు. నగరంలో నెలకొన్న మంచి నీటి సమస్యను పరిష్కరించాలన్న డిమాండ్ తో గుణదల సమీపంలో నడిరోడ్డుపై ధర్నాకు దిగిన వంగవీటి రాధాకు వామపక్షాలు మద్దతుగా నిలిచాయి. ఈ సందర్భంగా మాట్లాడిన రాధా... టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబునాయుడిని టార్గెట్ చేసుకుని వాగ్బాణాలు సంధించిన రాధా... ఏసీ గదుల్లో కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వలేని ప్రభుత్వాలు ఎందుకంటూ ఆయన టీడీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.