: వెండితెరకు ఎంతోమంది హాస్యనటులను పరిచయం చేశాను: దర్శకుడు వంశీ


ఎంతోమంది హాస్యనటులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత తనదేనని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం, మోరి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో వంశీ మాట్లాడుతూ, కొత్త సినిమా కోసం కథను రూపొందించే పనిలో ఉన్నానని, ఈ నేపథ్యంలోనే ఈ గ్రామాల పర్యటనకు వచ్చానని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాతో తనది విడదీయరాని బంధమని చెప్పారు. తాను తీసిన చాలా సినిమాల్లో గోదావరి నది నేపథ్యం ఉంటుందని చెప్పిన ఆయన, ఆ చిత్రాలన్నీ విజయవంతమైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. గతంలో వంశీ తీసిన ‘లేడీస్ టైలర్’, ‘శ్రీకనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్’ చిత్రాలను మోరి, శివకోడు గ్రామాల్లోనే చిత్రీకరించారు. కాగా, ఈమధ్య కాలంలో ‘వెన్నెల్లో హాయ్ హాయ్’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు.

  • Loading...

More Telugu News