: జయదేవ్ కు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు...సుధీర్ కష్టపడతాడు: మహేష్ బాబు
గల్లా జయదేవ్ కు ఎవరో ప్రచారం చేయాల్సిన అవసరం లేదని మహేష్ బాబు తెలిపాడు. 'బ్రహ్మోత్సవం' సినిమా ప్రమోషన్ సందర్భంగా మాట్లాడిన ఆయనను టీవీ యాంకర్, 'బుర్రపాలెంను దత్తత తీసుకోవడంలో ఎంపీ గల్లా జయదేవ్ సపోర్ట్ చేసినట్టున్నారు, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రచారం చేస్తారా?' అని అడిగింది. దీనికి మహేష్ బాబు సమాధానం చెబుతూ, రాజకీయాలకు తాను దూరం అని గతంలో చెప్పిన మాటమీదే నిలబడ్డానని అన్నాడు. అయినా, గల్లా జయదేవ్ కు ఎవరో ప్రచారం చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పాడు. జయదేవ్ ప్రజల కోసం పోరాడే విధానం ఆయనకు ప్లస్ అవుతుందని అబిప్రాయపడ్డాడు. అలాగే సుధీర్ బాబు చాలా కష్టపడి తనను తాను నిరూపించుకున్నాడని మహేష్ తెలిపాడు. బాలీవుడ్ లో కూడా పేరుతెచ్చుకోవడం శుభపరిణామమని మహేష్ తెలిపాడు. సుధీర్ పెద్ద స్టార్ గా ఎదుగుతాడని మహేష్ బాబు తెలిపాడు. తాను కూడా సుధీర్ కు కావాల్సినంత సపోర్ట్ చేయలేదని, అయినప్పటికీ ఎలాంటి నిరాశకు లోనుకాకుండా తనను తాను నిరూపించుకున్నాడని కితాబునిచ్చాడు. సుధీర్ మరిన్ని మంచి సినిమాలు చేస్తాడని మహేష్ విశ్వాసం వ్యక్తం చేశాడు.