: నేను అతనికి సలహాలిచ్చేంత వాడిని కాదు: కోహ్లీ


ఏబీ డివిలియర్స్ లాంటి ఆటగాడికి సలహాలిచ్చేంత అవసరం ఉండదని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. గుజరాత్ లయన్స్ తో జరిగి మ్యాచ్ సందర్భంగా సెంచరీ సాధించిన క్రమంలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ, సహచర ఆటగాడు డివిలియర్స్ తో ఎక్కువ మాట్లాడడానికి కారణమేంటని అడగగా, ఇద్దరం లయ అందుకున్నామని, ఇలా ఆడితే సరిపోతుందని అనుకున్నామని అన్నాడు. డివిలియర్స్ లాంటి ఆటగాడు బౌలర్లపై దాడికి దిగితే ఆ దృశ్యాన్ని చూడడం ఆనందంగా ఉంటుందని చెప్పాడు. అతనిలాంటి ఆటగాడితో ఆడడమే గౌరవమని, ఆయనకు సలహాలిచ్చేంత గొప్పవాడిని కాదని కోహ్లీ చెప్పాడు. ఏబీ ఆడుతుంటే చూడడానికి బాగుంటుందని కోహ్లీ చెప్పాడు. ఇద్దరం ఒకే మ్యాచ్ లో సెంచరీ చేయడం మరింత ఆనందాన్నిచ్చిందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News