: కొడుకుతో కలసి ర్యాంప్ వాక్ చేసిన రమ్యకృష్ణ... మీరూ చూడండి!


ఒకప్పటి టాలీవుడ్ బ్యూటీ, నేటి క్యారెక్టర్ నటి రమ్యకృష్ణ తన కుమారుడు రిత్విక్ తో కలసి ర్యాంప్ వాక్ చేశారు. చెన్నయ్ లోని ఓ సంస్థ 'మామ్ అండ్ కిడ్స్' కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, పలువురు మోడల్స్ వివిధ రకాల కాస్ట్యూమ్స్ ధరించి పాల్గొన్నారు. పలువురు చిన్నారులు సందడి చేసిన ఈ కార్యక్రమానికి రమ్య ముఖ్య అతిథిగా వచ్చి సందడి చేశారు. మొత్తం కార్యక్రమంలోనే ఆకర్షణగా నిలిచిన ఆమె, రిత్విక్ తో కలసి ర్యాంప్ పై నడుస్తుంటే, ఆహూతులు కేరింతలు, చప్పట్లతో అభినందించారు. ఆ వీడియోను మీరూ చూడండి.

  • Loading...

More Telugu News