: బొక్కలిరగ్గొట్టి భారత్ కు పంపిస్తా: విజేందర్ కు పోలాండ్ బాక్సర్ హెచ్చరిక


ప్రొఫెషనల్ బాక్సింగ్ లో వరుస విజయాలతో సత్తా చాటుతున్న విజేందర్ సింగ్ కు పోలాండ్ బాక్సర్ ఆండ్రిజెజ్ సోల్డ్రా సవాలు విసురుతున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో అడుగుపెట్టిన విజేందర్ సింగ్ ఇంత వరకు ఐదు బౌట్ లు ఆడాడు. తొలి నాలుగు బౌట్లలో సునాయాసంగా గెలిచిన విజేందర్ ఐదో బౌట్ లో తొలిసారి ఆరో రౌండ్ వరకు పోరాడాల్సి వచ్చింది. దీంతో ఆరో బౌట్ లో పోలాండ్ ప్రొఫషనల్ బాక్సర్ ఆండ్రిజెజ్ సోల్డ్రాతో మే 13న తలపడనున్నాడు. ఈ సందర్భంగా సోల్డ్రా మాట్లాడుతూ, తన లాంటి బాక్సర్ విజేందర్ కు ఇంతవరకు ఎదురు పడలేదని అన్నాడు. బొక్కలిరిచి భారత్ కు పంపిస్తానని హెచ్చరించాడు. దీనిపై విజేందర్ మాట్లాడుతూ, సోల్డ్రా పోటీల వీడియోలు చూశానని అన్నాడు. మరి ఎవరు ఎవరి బొక్కలిరుస్తారో ఈ నెల 13న తేలిపోనుంది.

  • Loading...

More Telugu News