: ముద్దు సీన్లకు అదనంగా డబ్బులివ్వండి: నర్గీస్ ఫక్రీ


'రాక్ స్టార్' సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన నర్గీస్ ఫక్రీ ముద్దులకు డబ్బులడుగుతోంది. ఇమ్రాన్ హష్మీతో కలిసి ప్రముఖ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న 'అజార్' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి సంగీతా బిజ్ లానీ పాత్రలో నర్గీస్ ఫక్రీ నటిస్తోంది. దీంతో ఇమ్రాన్ హష్మీ, నర్గీస్ ఫక్రీ మధ్య హాట్ హాట్ సన్నివేశాలు ఉన్నాయి. ఎక్కువ లిప్ లాక్ ముద్దుసీన్లు కూడా ఉన్నాయి. గతంలో ఒకసారి ముద్దులంటే విసుగు వచ్చేలా ఇమ్రాన్ హష్మీ ముద్దులు పెట్టాడంటూ నర్గీస్ వాపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ముద్దులు బాగా పండలేదని, మరోసారి ఈ ముద్దుల సీన్లు తీయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీంతో నర్గీస్ ను సంప్రదించగా, ఈ ముద్దుల గోల భరించలేక సినిమా చిత్రీకరణ ముందు అంగీకరించిన పారితోషికం కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఎక్స్ ట్రా ముద్దులకు ఎక్స్ ట్రా డబ్బులు కావాలని తేల్చిచెప్పిందట. ఈ సినిమాలో ఇన్ని ముద్దు సీన్లు ఉంటాయని తనకు తెలియదని, ఇన్ని టేకులు అంటే చికాకు తెప్పించిందని, అందుకే ఎక్కువ ఛార్జ్ చేయాలనిపించిందని నర్గీస్ ఫక్రీ తెలిపింది. తనకు ముద్దు సీన్లు, ఘాటైన సన్నివేశాల్లో నటించాలంటే ఇబ్బందని వెల్లడించింది. అయితే ఇమ్రాన్ హష్మీ చాలా మంచి నటుడని తెలిపింది. చాలా కూల్ గా ఉంటాడని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అతనికే తెలుసని చెప్పింది.

  • Loading...

More Telugu News