: నకిలీ వస్తువుల ఎగుమతిలో చైనా, టర్కీ టాప్.. ఐదో స్థానంలో ఇండియా
నకిలీ వస్తువులను అత్యధికంగా ఎగుమతి చేస్తోన్న దేశాల్లో చైనా, టర్కీ టాప్ ప్లేస్‌లో నిలిస్తే ఇండియా ఐదో స్థానంలో నిలిచింది. యూరోపియన్ యూనియన్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కార్యాలయంతో ఆర్గనైజేషన్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ కలిసి నిర్వహించిన సర్వేలో ఈ అంశం బయటపడింది. నకిలీ వస్తువులను అత్యధికంగా ఎగుమతి చేస్తోన్న దేశాల్లో వరసగా చైనా, టర్కీ, సింగపూర్, థాయ్ లాండ్, ఇండియా మొదటి స్థానాల్లో ఉన్నాయి. దీనిలో చైనాకు 63 శాతం నకిలీ వస్తువుల వాణిజ్యం ఉండగా, టర్కీ 3.3శాతం, సింగపూర్ 1.9 శాతం, థాయ్ లాండ్ 1.6 శాతం, భారత్ 1.2 శాతం నకిలీ వస్తువుల వాణిజ్యం చేస్తున్నాయని సర్వే పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 2.5 శాతం నకిలీ వస్తువులు మార్కెట్లోకి దిగుమతి అవుతున్నాయని తెలిపింది. ఈ దేశాల నుంచి నకిలీ వస్తువులు దిగుమతి అవుతున్న దేశాల్లో వరసగా అమెరికా, ఇటాలియన్, ఫ్రెంచ్ ఉన్నాయని సర్వేలో తేలింది.