: ‘అ..ఆ’ ఆడియో ఫంక్షన్ కు పవర్ స్టార్ వస్తున్నారు: హీరో నితిన్
ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అ..ఆ’ ఆడియో ఫంక్షన్ కు ముఖ్యఅతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరుకానున్నారని హీరో నితిన్ పేర్కొన్నాడు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ మే 2వ తేదీన హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరగనుందన్నారు. కాగా, నితిన్ సరసన సమంత నటించిన ఈ చిత్రం రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.