: సల్మాన్ ఖాన్ వివాదంలో చిక్కుకోవడంలో కొత్త ఏం ఉంది?: కత్రినాకైఫ్ ఘాటు వ్యాఖ్య
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై ఆయన మాజీ ప్రేయసి, నటి కత్రినా కైఫ్ ఘాటు వ్యాఖ్య చేసింది. త్వరలో ప్రారంభం కానున్న రియో ఒలింపిక్స్‌కు ఇండియన్ టీమ్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా సల్మాన్ ఖాన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. సల్మాన్‌కు ఆ అర్హత లేదంటూ దీనిపై వివాదం చెలరేగుతోన్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఆయనపై విమర్శలు చేస్తుంటే మరి కొందరు మద్దతుగా నిలుస్తూ పలు రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగుతున్న క్రమంలో సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ నుంచి ఎటువంటి స్పందన వస్తుందోననే ఉత్సాహంతో మీడియా ఆమెను ఈ విషయమై ప్రశ్నించింది. అయితే ఆమె చెప్పిన సమాధానం విన్న విలేకరులు అవాక్కయిపోయారు. సల్మాన్ ఖాన్ రియో ఒలింపిక్స్‌కు ఇండియన్ టీమ్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా నిలిచి వివాదంలో ఇరుక్కున్న అంశంపై మీ స్పందన ఏంటని కత్రినాను విలేకరులు అడిగితే.. దానికి సమాధానంగా ‘సల్మాన్ వివాదంలో చిక్కుకోవడంలో కొత్త ఏం ఉంది?’.. అంటూ ప్రశ్నించింది. 'సల్మాన్‌కు వివాదాలు కొత్తేం కాదు' అనేలా ఆమె చేసిన వ్యాఖ్య మీడియా సోదరులను ఆశ్చర్యపర్చింది.