: టీఆర్ఎస్ పరాజయం కోసం కలిసిన కాంగ్రెస్, టీడీపీ... పాలేరులో అభ్యర్థిని పెట్టబోమన్న తెలుగుదేశం!

పాలేరు ఉప ఎన్నికల్లో తాము అభ్యర్థిని నిలపబోమని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదని ఆ పార్టీ అధినేత నుంచి తెలంగాణ నేతలకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. వాస్తవానికి తెలుగుదేశం నుంచి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీ పడతారని భావించినా, విజయావకాశాలు చాలా తక్కువగా ఉండటం, టీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా ఓడించాలన్న నిర్ణయంతో కాంగ్రెస్ నిలిపిన మాజీ ఎమ్మెల్యే దివంగత రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరితకు మద్దతివ్వాలని నిర్ణయించింది. దీంతో పాలేరు తుది పోరులో టీఆర్ఎస్, కాంగ్రెస్ లు అమీ తుమీ తేల్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

More Telugu News