: నేను మంచి బాత్రూం సింగర్ ని: రకుల్ ప్రీత్ సింగ్


తాను మంచి బాత్రూం సింగర్ నని యువ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. 'సరైనోడు' సినిమా ప్రమోషన్ లో రకుల్ మాట్లాడుతూ, తనతో పాడించేంత ధైర్యం ఇంత వరకు ఎవరూ చేయలేదని చెప్పింది. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేస్తే మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్స్ తో మేనేజ్ చేసేయమని చెబుతానని రకుల్ పేర్కొంది. మెగా హీరోయిన్ అనిపించుకోవడం పట్ల ఆనందంగా ఉందని చెప్పింది. రామ్ చరణ్ తో మరోసినిమా 'తనీ ఒరువన్' రీమేక్ చేస్తున్నానని తెలిపింది. ఆ తరువాత సాయిధరమ్ తేజ్ తో ఒక సినిమాలో నటించనున్నానని చెప్పింది. బ్యాక్ టు బ్యాక్ (ఒకదాని తర్వాత మరొకటిగా) మెగా ఫ్యామిలీ హీరోలతో నటించడం పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపింది.

  • Loading...

More Telugu News