: శ్రీనగర్ నిట్‌ను మరో చోటుకి తరలించాల్సిందే: విద్యార్థుల డిమాండ్
ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓటమి పాలవ్వడంతో శ్రీనగర్ నిట్లో కాశ్మీర్ స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య చెలరేగిన ఉద్రిక్తత పట్ల స్థానికేతర విద్యార్థులు ఇంకా చల్లారలేదు. శ్రీనగర్‌లో తమకు భద్రత లేదంటూ దేశ రాజధాని ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిట్ విద్యార్థులు ఈరోజు మరోసారి ధర్నాకు దిగారు. హెచ్‌ఆర్‌డీ మంత్రి తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని, శ్రీనగర్ నిట్‌ను మరో చోటికి తరలించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. శ్రీనగర్ నిట్‌ను మరో చోటికి తరలించే విషయమై కొద్ది రోజుల క్రితం మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశాన్ని స్మృతి ఇరానీ నిరాకరించినట్లు సమాచారం.