: జగన్ ఎంతో గౌరవించారు, కానీ..: దేశంలో చేరికపై స్పందించిన సుజయకృష్ణ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తననెంతో గౌరవించారని, అయితే, వెనుకబడిన నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాలని నిర్ణయించుకున్నానని బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు వెల్లడించారు. ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, కార్యకర్తలతో చర్చించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు ఉండటం సహజమేనన్న ఆయన, బొత్స సత్యనారాయణ వైకాపాలో చేరినందుకు నిరసనగానే, తాను టీడీపీలోకి వెళుతున్నట్టు వచ్చిన వార్తలను ఖండించారు. కాగా, నేడు చంద్రబాబు సమక్షంలో సుజయకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారన్న సంగతి తెలిసిందే.