: 2019లో సొంతంగా పోటీ చేయాలని బీజేపీ నేతలు అనుకుంటే మంచిదే: గాలి ముద్దుకృష్ణమ నాయుడు

2019లో సొంతంగా పోటీ చేయాలని బీజేపీ నేతలు అనుకుంటే తమకూ మంచిదేనని టీడీపీ ఎమ్మెల్సి గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామంటే తమకు టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారంటూ బీజేపీ నేతలు తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. బీజేపీ నేతల అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, ప్రతి ఏడాది రూ.100 కోట్లు భిక్షం వేస్తున్నారని, ఇప్పటివరకు రాజధానికి సరైన నిధులు కేటాయించలేదని ఆయన విమర్శించారు.

More Telugu News