: ప్రత్యూష కేసుకు, నాకు ఇకపై ఎలాంటి సంబంధం లేదు: 'చిన్నారి పెళ్లికూతురు' తరఫు న్యాయవాది
'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌లో 'ఆనంది'గా నటించిన ప్రత్యూష బెనర్జీ(24) మృతి కేసులో మరో ట్విస్ట్ ఎదురైంది. ఇన్ని రోజులూ ప్రత్యూష తరఫున వాదించిన న్యాయవాది ఫల్గుణి బ్రహ్మభట్ ఇకపై ఆ కేసు వాదించబోనని అన్నారు. 'ప్రత్యూష కేసుకు, నాకు ఇకపై ఎలాంటి సంబంధం లేదు' అని వ్యాఖ్యానించారు. ఈ కేసును స్పెషల్ ప్రాసిక్యూటర్ చూస్తారని అన్నారు.
తమ తరఫున ఎవరు వాదించాలన్న విషయంలో ప్రత్యూష తల్లిదండ్రులు కాస్త గందరగోళానికి గురవుతున్నారని, దాంతో తాజాగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీలేష్ పవస్కర్‌ను ఈ కేసులో తమ తరఫున వాదించాల్సిందిగా వారు కోరారని సమాచారం. ఈ కేసులో నిందితుడు రాహుల్ రాజ్ సింగ్ తరఫున గతంలో వాదించిన నీరజ్ గుప్తాతో నీలేష్ కు అనుబంధం వుందట. ఆ కారణంగానే అతనితో కలసి పనిచేయడానికి ఇష్టం లేకనే ఫల్గుణి ఈ కేసునుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.