: 21న కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, గాయని ప్రణవిల వివాహం
ఈ నెల 21న కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, గాయని ప్రణవిల వివాహం జరగనుంది. ఈ విషయాన్ని రఘు తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపారు. కాగా, వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గత డిసెంబర్ 26న వీరి నిశ్చితార్థం జరిగింది. తమ పెళ్లి జరగనున్న వార్తతో పాటు నిశ్చితార్థం నాటి ఫొటోను కూడా రఘు పోస్ట్ చేశారు.