: పూరీ పారిపోలేదు కదా?...రాగానే తేల్చేద్దాం: తమ్మారెడ్డి భరద్వాజ
పూరీ జగన్నాథ్ ఎక్కడికి వెళ్లారో తనకు తెలియదని, అయితే అలా వెళ్లిన ఆయన రాకుండా పోడు కదా? అని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు. లోఫర్ డిస్ట్రిబ్యూటర్లతో పూరీ జగన్నాథ్ కు చెలరేగిన వివాదంపై ఆయన మాట్లాడుతూ, రెండు, మూడు రోజుల్లో పూరీ రాగానే సినీ పెద్దల సమక్షంలో దీనిపై చర్చించి పరిష్కరించుకుందామని అన్నారు. దీనిని మీడియాలోకి తీసుకురావడం వల్ల సినీ పరిశ్రమపై గౌరవం పోతుందని ఆయన చెప్పారు. సమస్యలు పరిష్కరించుకునేందుకు సినీ పరిశ్రమలో చాలా విధానాలు ఉన్నాయని ఆయన అన్నారు. వాటన్నింటినీ వదిలేసి, కేసులు, కోర్టులు, మీడియా అని తిరగడం వల్ల ఉపయోగం ఉందని ఆయన చెప్పారు. సినీ రంగంలో సానుకూల వాతావరణం ఉండాలని ఆయన పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణం చెడగొట్టేందుకు ఎవరూ ప్రయత్నించకూడదని ఆయన హితవు పలికారు. ఆయన వాదనతో డిస్ట్రిబ్యూటర్లు కూడా అంగీకరించారు.