: 80 కోట్లకు చేరువలో 'ఊపిరి'.. 100 కోట్ల రికార్డుకెక్కేనా..?
ఫ్రెంచ్ మూవీ 'ద ఇంటచబుల్స్' సినిమాకు మన నేటివిటీని జోడించి తెలుగులో రీమేక్ చేసిన సినిమా 'ఊపిరి'. నాగార్జున వీల్ చైర్‌కే పరిమితమయ్యే పాత్రలో కనిపించి అభిమానుల్ని మెప్పించడం, తమిళ హీరో కార్తీ స్ట్రయిట్‌గా తెలుగు సినిమాలో నటించడం, కథ అదుర్స్ అనిపించడంతో ఈ సినిమా ఇప్పుడు రూ.80 కోట్లకు చేరువకి వచ్చేసింది. ఇక సినీ వర్గాల చూపంతా ఊపిరి 100కోట్ల క్లబ్లో చేరుతుందన్న దానిపైనే ఉంది. వరస సెలవులు, మార్కెట్లో 'ఊపిరి'కి పోటీనిచ్చే చిత్రాలు అంతగా లేకపోవడంతో ఈ వారాంతానికి ఇది వందకోట్ల మార్క్‌ను దాటేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో చిత్ర నిర్మాతలు, కింగ్ నాగార్జునా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.