: ఈ స్పీడ్ చాలదు... పనుల వేగం ఇంకా పెంచాలి!: వెలగపూడిలో గల్లా జయదేవ్

అనుకున్న సమయానికి గుంటూరు జిల్లా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి చేయాలంటే, జరుగుతున్న పనుల వేగం పెంచాలని ఎంపీ గల్లా జయదేవ్ సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆదేశాల మేరకు ఈ ఉదయం తుళ్లూరు మండలంలో పర్యటించిన ఆయన, తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయ శ్లాబ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కాంట్రాక్టర్లు మరింత వేగంగా పనులు చేయాల్సి వుందని జయదేవ్ అన్నారు.

More Telugu News