: శ్రీనగర్ లో అల్లర్లు... భద్రతా దళాల కాల్పుల్లో వర్ధమాన క్రికెటర్ సహా ముగ్గురు మృతి

జమ్మూకాశ్మీర్ మరోసారి అట్టుడికింది. నిరసన తెలుపుతున్న ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించగా, మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. ఉత్తర కాశ్మీర్ లోని హంద్వారా ప్రాంతంలో, ఓ కాలేజీ విద్యార్థినిని భద్రతా దళాలు లైంగికంగా వేధించాయని వార్తలు రాగా, ఆపై నిరసనకారులు మూకుమ్మడిగా రోడ్లపైకి వచ్చి విధ్వంసానికి దిగారు. వారిని అదుపు చేసేందుకు భద్రతా దళాలు కాల్పులు జరపడంతో ఓ వర్ధమాన క్రికెటర్, 70 ఏళ్ల వృద్ధురాలు, మరో వ్యక్తి మరణించారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇది చాలా విచారకరమని, ఘటనపై విచారణ జరిపిస్తామని కాశ్మీర్ ఐజీ జావేద్ గిలానీ తెలిపారు. తుపాకీ కాల్పుల తరువాత ఈ ప్రాంతంలో నిరసనల తీవ్రత పెరగడంతో మరింత మంది పోలీసులను మోహరించినట్టు వివరించారు.

More Telugu News