: అందుకే, బాబీకి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాను: పవన్ కల్యాణ్
టాలెంట్ ఉంది కనుకే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రానికి బాబీకి దర్శకత్వం బాధ్యతలు అప్పగించానని ఒక ప్రశ్నకు సమాధానంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెప్పారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. బాబీ ఒక్క చిత్రానికే దర్శకత్వం వహించాడు కదా? అనే విషయాన్ని తాను ఎన్నడూ ఆలోచించలేదన్నారు. సినిమాకు సంబంధించి బాబీ చాలా క్లారిటీగా, ధైర్యంగా తాను చెప్పదలచుకున్నవి చెప్పాడని, అడగదలచుకున్నవి స్పష్టంగా అడిగాడని అన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రతి విషయాన్ని చక్కగా చర్చించుకున్నామన్నారు. తాను ఏదైతే అనుకున్నానో అదే ఈ సినిమాలో చూపించానని పవన్ కల్యాణ్ అన్నారు.